ఈ మేక ధర రూ. కోటి - MicTv.in - Telugu News
mictv telugu

ఈ మేక ధర రూ. కోటి

September 1, 2017

మేక ధర ఎంత ఉంటుంవది? మహా అయితే  పది వేలు. కానీ ముంబాయిలోని  డియోనర్ వధశాలలోని ఓ మేకకు పలుకుతున్న  ధర వింటే మీరు ఆశ్చర్యపోతారు.  ఆ మేకలో ప్రత్యేకత ఏందని అనుకుంటున్నారా. అవును ఆ మేకలో నిజంగానే ప్రత్యేకత ఉంది.

బక్రీద్  సందర్బంగా ముంబాయిలోని డియోనర్ వధశాలకు చాలా మేకలు వచ్చాయి. కానీ రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ మేకనే అక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అందుకు కారణం ఆ మేక ధర అక్షారాల ఒక కోటి ఏడువందల ఎనబై ఆరు రూపాయలు. ఆ మేకను అంత ధరకు పెట్టడానికి కారణాలు ఉన్నాయని వధశాల యాజమాని తెలిపారు. దానికి కారణం మేక మేడ భాగాన అల్లా అని పొలిన అరబిక్ అక్షరాల గుర్తులు ఉండడం. దాంతో ఆ మేకను అందరూ దేవుని చిహ్నంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మేక వయస్సు 15 నెలలు అని దాని యాజమాని సోహోల్ తెలిపారు. దానికి ఉన్న ప్రత్యేకత వల్లే భారీ ధరకు అమ్మడానికి పెట్టినట్ట తెలిపారు. కానీ కొనడానికి వచ్చిన వారందరు మేకను విచిత్రంగా చూస్తున్నారు తప్ప దానిని కొనడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు. అందుకే ఆ మేకను సగం ధరకు తగ్గించినట్టు తెలిపారు.