చిరంజీవి పేరు మార్పుపై.. మూవీ టీమ్ వివరణ - MicTv.in - Telugu News
mictv telugu

చిరంజీవి పేరు మార్పుపై.. మూవీ టీమ్ వివరణ

July 6, 2022

వరుస సినిమాలను లైన్లో పెట్టి యువ హీరోలతో సమానంగా మెగాస్టార్ చిరంజీవి దూసుకెళ్తున్నారు. మలయాళ రీమేక్ గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో ఇటీవల గాడ్ ఫాదర్ చిత్రం నుంచి చిరంజీవి ఫస్ట్ లుక్ రిలీజయింది. అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి పేరులో ఓ e అదనంగా పడింది. దాంతో ఆచార్య సినిమా ఫ్లాపుతో చిరంజీవి న్యూమరాలజిస్టు సూచన మేరకు పేరు మార్చుకున్నారన్న భావం వ్యాపించింది. తాజాగా ఈ వార్తలను చిత్రబృందం ఖండించింది. సినిమా యూనిట్ వీడియోను ఎడిట్ చేసినప్పుడు జరిగిన తప్పిదమే తప్ప చిరంజీవి ఎలాంటి పేరు మార్చుకోలేదని స్పష్టం చేసింది. అందులోనూ న్యూమరాలజిస్టు సలహా ఆయన అస్సలు తీసుకోలేదని వివరణ ఇచ్చింది. మరోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా చిరంజీవి పేరు మామూలుగా ఉన్న వీడియోను షేర్ చేసింది.