గోదావరి బోటు వెలికితీత పనులు.. మొండెంతో మృతదేహం లభ్యం.. - MicTv.in - Telugu News
mictv telugu

గోదావరి బోటు వెలికితీత పనులు.. మొండెంతో మృతదేహం లభ్యం..

October 20, 2019

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కుచ్చలూరు వద్ద ప్రయాణికులతో పాపికొండలు టూర్‌కి బయలుదేరిన బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో  తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాధం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే కొన్ని మృతదేహాలు లభ్యం కాగ.. మరికొన్ని మృతదేహాల ఆచూకీ మాత్రం ఇంతవరకు లభించలేదు. బోటు బయటకు వస్తే గానీ మిగిలినవారి మృతదేహాల అంతుచిక్కదని అటు బాధిత కుటుంబాలు, ఇటు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోటును వెలికి తీసేందుకు ధర్మడి సత్యం బృందం రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే వారి ప్రయత్నాలు ఫలించినట్టే ఫలించి విఫలం అవుతున్నాయి. నేటితో ఐదోరోజు సహాయక పనులు కొనసాగుతున్నాయి. 

Godavari boat.

కాకినాడ పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరుగుతోంది. అయితే ఇవాళ బోటు వెలికితీత పనుల సందర్భంగా కుచ్చలూరు వద్ద నదిలో ఓవ్యక్తి మొండెం లభ్యమైంది. బ్లాక్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్న ఆ మృతదేహాన్ని ప్రమాదంలో గల్లంతైన వారిలో ఒకరికిగా అధికారులు భావిస్తున్నారు. ఆ మృతదేహం ఎవరిది అనేదానిపై ఆరా తీస్తున్నారు. కాగా, ఇప్పటి వరకు దర్మాడీ సత్యం బృందం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. మరో కొత్త ప్లాన్ వేసింది ధర్మాడి సత్యం బృందం. స్కూబా డ్రైవర్లను నది గర్భంలోకి పంపించి బోటుకు లంగర్ తగిలించి.. ఆ తర్వాత బోటును బయటకు లాగాలనేది ధర్మడి సత్యం బృందం ప్రణాళికగా తెలుస్తోంది. వారు ఆక్సీజన్ మాస్కులు ధరించి నది గర్భంలోకి దిగారు. బోటు మునిగిన ప్రాంతంలో లోపలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. కాసేపటి తర్వాత బయటకు వచ్చి చాలా ముఖ్యమైన విషయాలను అధికారులు తెలిపారు.