గోదావరి బోటు.. శవాలకు భయపడుతున్న ఈతగాళ్లు! - MicTv.in - Telugu News
mictv telugu

గోదావరి బోటు.. శవాలకు భయపడుతున్న ఈతగాళ్లు!

October 19, 2019

godavari ...

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. ఇవాల్టికి వెలికతీత పనులు నాలుగోరోజుకు చేరుకున్నాయి. బోటును ఒడ్డుకు చేర్చేందుకు ధర్మాడి సత్యం బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. శనివారం ఉదయాన్నే రెండురోప్‌లు, నాలుగు లంగర్లను గోదావరిలో దింపి బోటు మునిగిన ప్రదేశంలోనే చుట్టూ తిరిగారు.  సాయంత్రం వరకు లంగరు మూడుసార్లు వేశారు. ఐరన్ రోప్‌తో బోటు మునిగిన ప్రాంతంలో లంగర్లు వేసినా ఫలితం లేకపోయింది. ఒకసారి మాత్రం లంగరుకు బోటు తగిలినట్టే తగిలి జారిపోయింది. లంగరుకు బోటు కింద వెనుక భాగంలో ఉన్న పంకా సాఫ్ట్‌కు తగిలితే లింక్‌ పడి పైకి తీయొచ్చు. 

నిన్నటిలానే ఈ రోజు కూడా బోటు ఒక్కడుగు కూడా మందుకురాలేదు. ప్రస్తుతం బోటు 48 అడుగుల లోతులో ఉందని ధర్మాడి సత్యం బృందం తెలిపింది. అండర్‌ వాటర్‌ నిపుణులు విశాఖపట్ణణం నుంచి వస్తే తప్ప బోటు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. నేరుగా బోటు ఉన్న ప్రదేశానికి వెళ్లి రోప్‌ లింక్‌ పెట్టి బయటకు తీసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న సెర్చ్‌ ఆపరేషన్‌ను కాకినాడ పోర్టు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాగా, బోటు నెలరోజులకు పైగా నీటిలో నానిపోయింది. ఈ క్రమంలో యాంకర్‌కు తగిలినప్పటికీ… శకలాలు తప్ప పూర్తిస్థాయిలో బోటు పైకి రావడం కష్టమేనని అంటున్నారు.