గోదావరిలో మునిగిన బోటు వెలికితీత సక్సెస్..  - MicTv.in - Telugu News
mictv telugu

గోదావరిలో మునిగిన బోటు వెలికితీత సక్సెస్.. 

October 22, 2019

Godavari Boat Successfully Out.

నెల రోజుల నిరీక్షణకు తెరపడింది. గోదావరిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటు ఆచూకీ లభించింది. ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసే పనిలో సక్సెస్ అయింది. లంగర్లకు బోటు చిక్కడంతో అతి కష్టం మీద దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరో రెండు గంటల్లో బోటు గోదారి ఓడ్డుకు చేరనుంది. స్కూబా డైవర్ల సాయంతో బోటుకు లంగర్లు ఫిక్స్ చేసి పైకి తీసుకువస్తున్నారు. ఎంతో పకడ్బందీగా మొదలుపెట్టిన ఈ ఆపరేషన్ చివరికి సక్సెస్ అయింది. 

 బోటును వెలికితీస్తున్న సమయంలో మొదట కొన్ని భాగాలుగా విడిపోయి బయటకు వచ్చాయి. అన్నా పట్టు సడలకుండా దాన్ని వెలికితీశారు. బోటు పైకి వస్తుందన్న విషయం తెలిసిన మృతుల కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకు లభించని వారి మృతదేహాలు ఏమైనా అందులో చిక్కుకొని ఉంటాయని ఆశగా చూస్తున్నారు. కాగా గత నెల 15న పర్యాటకులతో వెళ్తున్న బోటు మునిగిపోయింది. 38 రోజులపాటు దీన్ని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగించిన సంగతి తెలిసిందే.