గద్వాల్ అమ్మకు కోటి రూపాయల దండాలు - MicTv.in - Telugu News
mictv telugu

గద్వాల్ అమ్మకు కోటి రూపాయల దండాలు

October 26, 2020

Goddess Durga decoration with currency notes in Gadwal

దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. పశ్చిమ బెంగాల్, మైసూర్, ఢిల్లీలలో కరోనాను లెక్క చేయకుండా భక్తులు ఆలయాలకు, మంటపాలకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లోనూ శరన్నవరాత్రులు వైభవంగా జరిగాయి. అమ్మవారి అలంకరణలో భక్తులు కొత్త పోకడలు పోయారు. 

గద్వాల్ పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుర్గమ్మను భక్తులు కోటి రూపాయల విలువైన నోట్లతో శోభయమానంగా  అలంకరించారు. ఒక కోటీ 11 లక్షల, పదకొండు వేల, నూటా పదకొండు రూపాయల మధ్య అమ్మవారు ధనలక్ష్మి అలకారంలో కాంతులు చిందించారు. కొన్నినోట్లు పువ్వుల ఆకారంలో మడిచి అలంకరించడం విశేషం. జపాన్ ప్రజలు కాగితాలను పువ్వులుగా, రకరకాల వస్తువుగా మడిచే ఒరిగమి కళను దీని కోసం వాడారు. నోట్లను పువ్వులుగా, పూల గుత్తులాగా, పూల దండలుగా కూర్చారు. 

కరోనా కష్టకాలంలో కొన్ని చోట్లు ఉత్సవాలు నామమాత్రంగానే జరగ్గా గద్వాలలలో ఏ లోటూ లేకుండా నిర్వహించారు. అమ్మవారిని గత ఏడాది కూడా ఇలాగే కరెన్సీ నోట్లతో అలంకరించామని ఆలయ అధికారులు చెప్పారు. గత ఏడాది 3 కోట్ల 3 లక్షల 33 వేల 333 రూపాయల విలువైన నోట్లతో తీర్చిదిద్దారు. కరోనా వల్ల ఈసారి అలంకరణకు డబ్బు తగ్గిందని, అలంకరణకు వాడిన డబ్బును భక్తులకు తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించారు. ఈసారి 50 భక్తులు కోటీ 11 లక్షలను అందజేశారని తెలారు. 

ఈసారి దసరా వేడుకల్లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు కూడా కొలువు దీరారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకున్నందుకు సోనూ సూద్ విగ్రహాలను దుర్గమ్మ మండపాల్లో ఏర్పాటు చేశారు. భారత సరిహద్దులో కాల్పులు జరుపుతున్న చైనాపై వ్యతిరేకత కూడా  భక్తుల్లో బాగానే వ్యక్తమైంది. దుర్గమ్మ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ తలను నరికినట్లు విగ్రహాలు తయారు చేశారు.