అడుగడుగున దుర్గ ఉంది.. అందరిలో దుర్గ ఉంది.. (ఫోటో గ్యాలరీ) - MicTv.in - Telugu News
mictv telugu

అడుగడుగున దుర్గ ఉంది.. అందరిలో దుర్గ ఉంది.. (ఫోటో గ్యాలరీ)

October 23, 2018

సృష్టికి మూలం అమ్మ. ఆమె లేకపోతే లోకం లేదు. దేవుడు అన్నిచోట్లా ఉండడం సాధ్యంకాక అమ్మలను సృష్టించాడని అంటారు. అందుకే మానవజాతి కాస్త బుద్ధి నేర్చింది మొదలు అమ్మను దేవతగా పూజిస్తూ వస్తోంది. అమ్మతల్లి, మదర్ గాడెస్.. పేరు ఏదైనా చరిత్రలో తొలి పూజ అందుకున్నది అమ్మే. మా, అన్నా, మేరీ అన్నా అమ్మకు ప్రతిరూపమే..

హిందూ సంప్రదాయం అమ్మకు గౌరవనీయ స్థానం ఇచ్చింది. వివిధ రూపాల్లో ఆమెను కొలుస్తుంటారు. విజయదశమిలో అమ్మను పలు అవతారాల్లో ఆరాధిస్తారు.

బెంగాలీలకు ఇది మహావేడుక. దుర్గ మంటపాలను ఏర్పాటు చేసి, వినాయక చవితికంటే ఘనంగా నిర్వహిస్తారు. దుర్గను గంగ ఒడిలోకి సాగనంపుతారు.

మరి పండగ తర్వాత? దుర్గమ్మ కేవలం, పండగలకు, పూజలకే పరిమితమా? అమ్మకు ప్రతిరూపమైన దుర్గ ఆ తర్వాత కనిపించదా? మనల్ని పట్టించుకోదా? కనుమరుగైపోతుందా? ఒకవేళ కనిపించిన కేవలం ఆలయాలను దాటి బయటికి రాదా?

వస్తుంది… దుర్గమ్మ నీ పక్కన, నా పక్కన ఉంటుంది. పాపాయి పక్కన, ముసలవ్వ పక్కనా ఉంటుంది. పూజారి పక్కనే కాకుండా పారిశుద్ధ్య కార్మికుడి పక్కనా ఉంటుంది. దుర్గ సర్వాంతర్యామి. అందర్నీ చల్లగా కాపాడుతూ ఉంటుంది. ఎవరేం చేస్తున్నారో జాగ్రత్తగా కనిపెడుతూ ఉంటుంది. బెంగాలీ ఫొటోగ్రాఫర్ సౌరోదీప్ ఘోష్ ఈ సత్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించాడు. అతడు దుర్గను కళ్లకు కట్టిన వైనం గురించి మాటల్లో వర్ణించడం అనవసరం.. మీరే చూడండి..

(ఫస్ట్‌పోస్ట్, సౌరోదీప్ ఘోష్ సౌజన్యంతో)