godfather-3-weeks-world-wide-collection-report
mictv telugu

ఫ్లాప్ ఫాదర్..!

October 27, 2022

భారీ అంచనాలతో విడుదలైన గాడ్ ఫాదర్ అన్ని సెంటర్స్ లో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. అయితే తన స్టైల్ కి విరుద్ధంగా డిఫరెంట్ జోనర్ లో మెగాస్టార్ చేసిన ఈ మూవీకి క్రిటిక్స్ నుండి కాంప్లిమెంట్స్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదనే చెప్తున్నాయి ట్రేడ్ లెక్కలు. గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు చూస్తుంటే భారీ స్థాయిలోనే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా దగ్గరదగ్గరగా 55 కోట్లకు పైగా షేర్ సాధించినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం దాదాపు 90 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఈ లెక్కన చూస్తుంటే దాదాపు 35 కోట్ల వరకు నష్టాన్ని తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా బ్రేక్ ఈవెన్ టచ్ చేయడం అసాధ్యంగానే మారేట్టు కనిపిస్తోంది. అయితే గాడ్ ఫాదర్ ఘోర పరాజయానికి ముఖ్యకారణాలు ఇవే అంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. మలయాళంలో లూసిఫెర్ కి తెలుగులో చేసిన మార్పులే గాడ్ ఫాదర్ ఫ్లాప్ కి కారణం అంటున్నారు. మొదట్లో ఈ మార్పులు కలిసొచ్చాయని అనుకున్నా లాంగ్ రన్ లో ఆ ప్రయోగం బెడిసికొట్టిందని అంటున్నారు. ముఖ్యంగా లూసిఫెర్ క్లైమాక్స్ మార్చటం గాడ్ ఫాదర్ కి జరిగిన కాస్లీ మిస్టేక్ అంటున్నారు.

తన తండ్రి రాజకీయ పార్టీ కోసం విదేశాల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేసే డాన్ పాత్రలో మోహన్ లాల్ నటిస్తాడు. అయితే లూసిఫర్ లో ఆఖరి వరకు ఈ విషయం రివీల్ చేయరు. సినిమా అయిపోయే చివరి నిమిషంలో నరాలు తెగే ఉత్కంఠతో ఈ సీన్ రివీల్ చేస్తారు. డాన్ కోసం ఎదురుచూస్తున్న బ్యాచ్ కోసం.. ఛాపర్ ఫ్లయిట్ లో ఒకవ్యక్తి దిగటం.. ఆ వ్యక్తికీ అందరు సలాం కొట్టడం.. ఆ డాన్ పాత్రలో అత్యంత నాటకీయంగా మోహన్ లాల్ కనిపించటంతో.. లూసిఫెర్ చూస్తున్న వారికి ఒక హై వస్తుంది. లూసిఫెర్ సినిమా అంతా ఒక ఎత్తైతే.. ఆ వన్ మినిట్ క్లైమాక్స్ మరో స్థాయిలో ఉంటుంది. కానీ మన గాడ్ ఫాదర్ లో అదేమీ ఉండదు. పతాక సన్నివేశాల్లో విలన్ డెన్ లోకి చిరు ఎంట్రీ ఇవ్వటం..అ ది చూసిన విలన్స్ డాన్ వచ్చాడంటూ భయపడటం.. రామ్ లక్షణ్ సోదరులు కంపోజ్ చేసిన రెగ్యులర్ ఫైట్ సీక్వెన్స్ తో గాడ్ ఫాదర్ క్లైమాక్స్ ని చుట్టేశారు. ఇలాంటి కొన్ని అసంబద్ధ మార్పుల కారణంతో లూసిఫెర్ ఇచ్చిన కిక్ ఇవ్వకపోవటంతో బాక్సాఫీస్ దెగ్గర గాడ్ ఫాదర్ బోల్తా కొట్టిందని అంటున్నారు క్రిటిక్స్. అయితే ఆచార్య ఫ్లాప్ టాక్‌తో భారీ నష్టాల్నీ తెస్తే.. గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్‌తోనూ నష్టాల్ని తెచ్చి పెట్టడం మెగా ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది.