Godfather Hindi trailer released by Salman Khan
mictv telugu

కాస్టింగ్ కౌచ్ ఉంది.. చిరంజీవే సాక్ష్యం : సల్మాన్ ఖాన్

October 2, 2022

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ చిత్ర హిందీ ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు హీరోలు ఇండస్ట్రీ వ్యవహారాల గురించి సరదాగా మాట్లాడారు. నార్త్, సౌత్ గురించి, పాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకోగా ఈ క్రమంలో అనుకోకుండా కాస్టింగ్ కౌచ్ గురించి టాపిక్ వచ్చింది. దీనికి సల్మాన్ చిరంజీవితో తనకున్న అనుభవాన్ని ఫన్నీగా ఇలా చెప్పుకొచ్చారు. ‘కాస్టింగ్ కౌచ్ ఉంది. మేమిద్దరం కొన్నేళ్ల క్రితం థాయిలాండ్‌లో ఓ కమర్షియల్ యాడ్ చేశాం. అది పూర్తి చేసి ముంబైలో రాత్రి 1.30కి ల్యాండ్ అయ్యాం. చిరంజీవి ఉదయాన్నే విమానంలో హైదరాబాద్ వెళ్లాలి. కాసేపు మాట్లాడుకున్నాక.. బెడ్రూంలోకి వెళ్లి పడుకోమని చెప్పాను. కానీ ఆయన నా కౌచ్‌లో పడుకుంటానన్నారు. నేను కూడా అక్కడే పడుకోవాలని చిరంజీవికి ఎలా చెప్పాలి అనుకున్నాను. చివరికి ఇద్దరం ఒకేచోట పడుకున్నాం. ఉదయం లేచి చిరంజీవి హైద్రాబాద్ వెళ్లిపోయారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. నేను కాకుండా నా కౌచ్‌లో పడుకున్న ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. అలా కాస్టింగ్ కౌచ్ జరిగింది కాబట్టి ఆయన సినిమాలో నేను నటించాను’ అని సరదాగా వ్యాఖ్యానించారు.