Godfather Movie Creates New Records In Netflix
mictv telugu

అంతటా అవమానాలు.. అక్కడ మాత్రం సంచలనాలు

November 24, 2022

ఆచార్యతో ఎదురైన అవమానాలని గాడ్ ఫాదర్ తో లెక్క సరిచేయాలనుకున్నారు మెగాస్టార్. అయితే చిరంజీవి ఆశించినట్టుగానే గాడ్ ఫాదర్ టాక్ బ్లాక్ బస్టర్ అని వచ్చింది. అన్ని థియేటర్స్ లో యునానిమస్ మౌత్ టాక్ తో పాటు క్రిటిక్స్ నుండి పాజిటీవ్ రివ్యూస్ కూడా దక్కించుకుంది గాడ్ ఫాదర్. దీంతో మూవీ భారీ హిట్ అనుకున్నారంతా. చిత్ర యూనిట్ సక్సెస్ మీట్స్ కూడా పెట్టేశారు. కానీ లాంగ్ రన్ లో అనూహ్యంగా చతికిలపడింది గాడ్ ఫాదర్. ఫస్ట్ వీక్ తరువాత ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించలేకపోయారు మేకర్స్. దాంతో గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయలేక ఫ్లాప్ పేరుని మూటకట్టుకుంది. చిరంజీవి, సల్మాన్ ఖాన్ బ్రాండ్ సైతం కలెక్షన్స్ ని పెంచలేదు. యూత్, ఫాన్స్, మాస్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చినా ఫ్యామిలీస్ మాత్రం థియేటర్స్ కి రాలేదు. లేడీస్ కదిలొస్తేనే ఏ సినిమాకైనా లాభాలు వస్తాయి. అయితే పొలిటికల్ మాఫియా బ్యాక్ గ్రౌండ్ కావటంతో కుటుంబ ప్రేక్షకులు గాడ్ ఫాదర్ పై మక్కువ చూపెట్టలేదు.

కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. అన్ని థియేటర్స్ లో కలెక్షన్స్ లేక చతికిల పడ్డా.. ఓటీటీలో మాత్రం గాడ్ ఫాదర్ సంచలనాలు సృష్టిస్తుంది. తాజాగా ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. అక్కడ కూడా `ఆచార్య` తరహా ఫలితమే లభిస్తుందని అంతా భావించారు కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ `గాడ్ ఫాదర్` తెలుగు వెర్షన్ టాప్ 3లో, హిందీ వెర్షన్ టాప్ 1 లో ట్రెండ్ అవుతూ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం వున్నక్రేజ్ కి తగ్గట్టుగా నెట్ ఫ్లిక్స్ లో వున్న సినిమాల్లో ఓ వారం పాటు `గాడ్ ఫాదర్` తెలుగు, హిందీ వెర్షన్ లు టాప్ 10లో వుండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వార్త విని చిరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారట. ఇక 90కోట్ల బ్రేక్ ఈవెన్ కాలేక థియేట్రికల్ బిజినెస్ లో వచ్చిన నష్టాలని గాడ్ ఫాదర్ మేకర్స్ ఓటీటీ ద్వారా రికవర్ చేసుకోబోతున్నారు. థియేటర్స్ కు రాని ఫ్యామిలీ ఆడియన్స్ పెద్దఎత్తున ఓటీటీలో గాడ్ ఫాదర్ ని వీక్షిస్తున్నట్టు సమాచారం. అక్టోబర్ 5న దీపావళి సందర్భంగా విడుదలై పేలకపోయినా.. నెట్ ఫ్లిక్స్ లో మాత్రం చిరంజీవి లెక్క సరిచేసేశాడని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : నీకు చాలా పొగరు – వెన్నెల కిషోర్ విషెష్ పై మంచు విష్ణు ఫైర్