godfather seen repeat by pavan kalyan
mictv telugu

ఇప్పటంలో గాడ్ ఫాదర్ సీన్ రిపీట్..వీడియో

November 5, 2022

గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలోని పవన్ కల్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు విస్తరణ పనులు పేరుతో కూల్చివేసిన ఇళ్లను జనసేనాని పరిశీలించారు. ఈ క్రమంలో పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఇప్పటం గ్రామానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కాలినడకనే గ్రామానికి వెళ్లారు. జాతీయ రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల మేర పవన్ నడిచి వెళ్లడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు కాస్త వెనక్కి తగ్గి వాహనాల్లో వెళ్లేందుకు పవన్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో పవన్ కల్యాణ్.. తన కారు పైనే కూర్చొని ప్రజలకు అభివాదం చేస్తూ ఇప్పటం వెళ్లారు.

పవన్ నడిచి ఇప్పటం వెళ్లే వీడియోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోని సన్నివేశంతో పోల్చుతూ ఎడిట్ చేసారు. రెండు సన్నివేశాలను కట్ చేసి వీడియోలు చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న కారుని రూల్స్ ఒప్పుకోవంటూ పోలీస్ ఆఫీసర్ ఆపేస్తాడు. అప్పుడు చిరంజీవి రూల్స్ కార్లకే కానీ.. కాళ్లకు కాదంటూ నడుచుకుంటూ వెళ్లారు.ఇప్పుడు పవన్ అదే చేశారని..తన కార్లను పోలీసులు ఆపివేయడంతో నడిచి వెళ్ళారంటున్నారు. ఆ రీల్ సీన్‌ను.. రియల్ లైఫ్‌లో రిపీట్ చేసారని అభిమానులు మురిసిపోతున్నారు.