భక్తి, ఆధ్యాత్మక చింతన పేరుతో మహిళల జీవితాలను నాశనం చేస్తున్న కామంధుల పాపం పండుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు అత్యాచారం కేసులో జీవిత ఖైదు పడింది. ఆయన వయసు 81 ఏళ్లు. ఇలాంటి మరో కేసులో ఇప్పటికే ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు. 2013లో తన శిష్యురాలిపై అఘాయిత్యం జరిపిన కేసులో గాంధీనగర్‌లోని జిల్లా సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఆశారాంకు జీవిత ఖైదు విధించి, ఆయన భార్య సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. ఆశారాం అసహజ శృంగారానికి పాల్పడి, బాధితులను బెదిరించారని కోర్టు తెలిపింది. 55 మంది సాక్షులను విచారించి ఆయనను దోషిగా తేల్చింది. తాజా శిక్షను పైకోర్టులు కూడా ఖరారు చేస్తే ఆశారాం జీవితమంతా జైల్లోనే గడపాల్సి ఉంటుంది. మరో అత్యాచార కేసులో దోషిగా తేలిన బాబా ప్రస్తుతం రాజస్తాన్ లోని జోధ్‌పూర్ జైల్లో ఉన్నారు. ఆశారాం ఆశ్రమాల్లో హత్యలు, అత్యాచారాలు పెద్ద సంఖ్యలో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది సాక్షులను కూడా మాయం చేశారని ఆయనపై కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి :
తడబడుతున్న ఏడడుగులు-విడాకులవైపు అడుగులేస్తున్న ఎన్నారైలు
బోనస్‌ను సంచుల్లో మోసుకెళ్లారు.. కట్టలే కట్టలు..