ప్రస్తుతం దేశంలో చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాదిన మరింత ఎక్కువ చలి ఉంది. చలితో మనుషులు గజగజలాడుతున్నారు. చలి నుంచి రక్షించుకునేందుకు స్వెట్టర్స్, దుప్పట్లు, శాలువాలను ధరించి బయటకు వస్తున్నారు. అయితే వారణాసి ఓ వింత దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనుషులతో పాటు దేవుళ్లు కూడా దుప్పట్లు, ఉన్ని దుస్తులు, శాలువాలతో దర్శనమిస్తున్నారు.
అయితే.. వారణాసిలో ఇలా దేవతా విగ్రహాలకు దుప్పట్లు కప్పే సంప్రదాయం దాదాపు వెయ్యేళ్ల నుంచి ఉందంట. కాశీ విశ్వనాథ్, చింతామణి గణేశ్, బారా గణేశ్, గోడీయ మఠం దేవాలయాల్లోని విగ్రహమూర్తులకు సంప్రదాయ దుస్తులతో ఆకర్షణీయంగా అలంకరించారు. భక్తులు కూడా భగవంతుడికి రక్షణగా దుప్పట్లు, శాలువాలు, వెచ్చని దుస్తులతో కప్పుతున్నారని పూజారి విభూతి నారాయణ్ శుక్లా తెలిపారు. అంతేకాకుండా వేడినీలతో స్నానం చేయించడం, ఆలయంలో హీటర్లు పెట్టడం వంటివి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు కూడా దేవనుకి స్వెట్టర్స్ ను కానుకలుగా అందిస్తున్నారు.