అలుపన్నది లేదా ఎగిసే అలకు….ఎదలోని లయకు అని సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట రాసారు. ఆయనకు ఈపక్షి గురించి తెలియదు కాబట్టి అల అని రాసారు కానీ దీన్ని చూస్తే ఎగిరే గాడ్ విట్ కు రాసేవారేమో. అంత ఘనత ఉందీ పక్షికి. అందుకే గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కింది కూడా. రాత్రి పగలు లేకుండా ఏకధాటిగా పదకొండు రోజులు….అది కూడా ఎక్కడా విశ్రాంతి కూడా తీసుకోకుండా ప్రయాణం చేసిందీ గాడ్ విట్ బర్డ్. మొత్తం పదకొండు వేల కిలోమీటర్లు గాల్లో ఎగురుతూనే ఉంది.
గాడ్ విట్ అనే ఈ పక్షిని లిమోసా లప్పినోకా అనే బర్డ్ ఇది. నెమలిలా ఉంటుంది ఇది. దీని మీద పరిశోధన చేశారు మన పరిశోధకులు, వన్య ప్రాణి నిపుణులు. ఈ పక్షి చాలా దూరం ఎగరగలదని తెలుసు కానీ ఎంత దూరమో పరీక్షించాలనుకున్నారు. అందుకే దీని కాళ్ళకు 234684 అనే నెంబర్ తో 5జీ శాటిలైట్ ట్యాగ్ ను కట్టారు. తర్వాత వదిలేశారు. అలా వదిలిన తర్వాత ఈ గాడ్ విట్ అమెరికాలోని అలస్కాల నుంచి వలస మొదలుపెట్టి ఆస్ట్రేలియాలోని టాస్మానియాకు చేరుకుంది.
అక్టోబర్ 13వ తేదీన దాని ప్రయాణం మొదలైంది. మొత్తం పదకొండు రోజులు ఎక్కడా ఆగకుండా, ఏ చెట్టూ మీదా వాలకుండా ఎగురుకుంటూ పోయింది. ఈ పక్షి ప్రయాణించిన దూరం భూమి పూర్తి చుట్టుకొలతలో మూడోవంతు. లండన్ నుంచి న్యూయార్క్ మధ్య రెండున్నర సార్లు ప్రయాణించినంత దూరం. గతంలో ఇదే జాతికి చెందిన మరో పక్షి 217 మైళ్ళు ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఇప్పడు ఇది. అయితే ఇది 11 రోజులు ఏమీ తినకుండా, తాగకుండా ట్రావెల్ చేయడం వలన సగం బరువు తగ్గిపోయిందట.
చిన్న తోక, పొడుగు ముక్కు, సన్నకాళ్ళతో ఉండే గాడ్ విట్ పక్షి 90 డిగ్రీల యూటర్న్ తీసుకుని నేల మీదకు వాలుతుంది. దీని ప్రత్యేకత ఇది. చాలా రిస్క్ తో ఉంటుందిట దీని జీవితం. లోతుగా ఉన్న నీళ్ళ మీద వాలితే దీని ప్రాణాలు పోతాయని చెబుతున్నారు టాస్మానియాకు చెందిన వ్యప్రాణ నిపుణులు ఎరిక్ వో ఎహ్లెర్. వాటి కాళ్ళ కింద భాగం నీటి మీద తేలేందుకు అనుగుణంగా ఉండదని అంటున్నారు. సదకొండు వేల కిలోమీటర్ల ప్రయాణం చేయడం అంటే చాలా రిస్క్ అని, ఈ గాడ్ విట్ పక్షి పెద్ద రిస్కే చేసిందని వివరించారు.