జార్జిరెడ్డి ఓ అద్భుతం.. స్విట్జర్లాండ్ యువకుడి ప్రశంస..  - MicTv.in - Telugu News
mictv telugu

జార్జిరెడ్డి ఓ అద్భుతం.. స్విట్జర్లాండ్ యువకుడి ప్రశంస.. 

November 25, 2019

అడుగడుగునా ‘జార్జిరెడ్డి’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతీచోట సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. 1960-70 దశకాల మధ్య వాతావరణాన్ని చాలా చక్కగా చూపించారని ప్రశంసిస్తున్నారు. విప్లవ ధృవతారగా నిలిచిన జార్జిరెడ్డి కథ ఈతరం వాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.. ఇప్పటివారికి ఇలాంటి స్ఫూర్తివంతమైన కథలు కావాలని అంటున్నారు. సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించగా.. ‘దళం’ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి తెలుగువాళ్లే కాదు విదేశీయుల నుంచి కూడా ఊహించని రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాను చూసిన ఓ విదేశీయుడు అద్భుతమైన సినిమా అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. 

స్విట్జర్లాండ్ దేశపు నటుడు అయిన అలెగ్జాండర్ హోసిల్ సినిమా చూసి తన స్పందనను తెలియజేశాడు. భారతీయ సినిమాలల్లో తెలుగు సినిమాలు ఈస్థాయిలో రావడం తాను ఊహించలేదని అన్నాడు. భారతీయ సినిమాలు దశ మార్చుకున్నందుకు తాను షాక్ అయ్యానని.. అదే విధంగా చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. తన మిత్రుడు నరేష్ ఈ సినిమాలో ఓ పాత్రలో మెరవడం నాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందని పేర్కొన్నాడు. త్వరలోనే ‘ఐలవ్ మై కంట్రీ ఫిల్మ్ ప్రాజెక్ట్’ గురించి చెబుతానన్నాడు. క్రౌడ్ ఫండింగ్‌తో స్నేహితులు కలిసి ఓ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.