27 ఏళ్లలో ఒక్కరోజూ సెలవు పెట్టలేదు.. 62 లక్షల గిఫ్ట్.. - MicTv.in - Telugu News
mictv telugu

27 ఏళ్లలో ఒక్కరోజూ సెలవు పెట్టలేదు.. 62 లక్షల గిఫ్ట్..

June 25, 2022

 

కొందరు డ్యూటీకి ఎలా పంగనామం పెట్టాలా? అని నిత్యం ఆలోచిస్తుంటారు. లీవుల కోసం కొందురైతే తాము పుట్టకముందే చనిపోయిన తాతముత్తాలను మళ్లీ మళ్లీ చనిపోయారని చెప్పేస్తుంటారు. మరోపక్క కొందరు బుద్ధిమంతు తమ పనినే దైవంగా భావిస్తారు. అనవసరంగా సెలువ పెట్టరు. కొందరైతే అసలు సెలవులే పెట్టరు. వానొచ్చినా, వంగడమొచ్చినా, పెళ్లిళ్లు, చావులు తోసుకొచ్చినా తగ్గేదేలే అంటూ డ్యూటీకి వచ్చేస్తుంటారు.

అమెరికాలోని బర్గర్ కింగ్ సంస్థలో పనిచేస్తున్న కెవిన్ ఫోర్డ్ అలాంటి వాళ్లకు పెద్ద బ్రో. 60 ఏళ్ల కెవిన్ గత 27 సంవత్సరాల్లో ఒక్కంటంటే ఒక్క సెలవు కూడా పెట్టకుండా పనిచేస్తున్నాడు. అంతేకాదు, కస్టమస్టర్లకు సర్వీసులో ఏ లేపమూ రానివ్వడం లేదు. అతని అంకింతభావానికి కస్టమర్లు ఫిదా అయ్యారు. అతనికేదైనా సాయం చేయాలని గోఫండ్‌మి వేదికపై విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు రూ. 62 లక్షల రూపాయలు వచ్చాయి. తన అంతికభావాన్ని గుర్తిస్త బర్గర్ సంస్థ సినిమా టికెట్లు, పెన్నులు, మంచి బ్యాగు ఇచ్చిందటూ కెవిన్ ఓ వీడియో పోస్ట్ చేయడంతో అతని గురించి తొలిసారి బయటకి తెలిసింది. అందరూ అతనికి చేతనైనంత సాయం చేస్తున్నారు. హాలీవుడ్ నటుడు డేవిడ్ స్పేడ్ తొలుత 5వేల డాలర్లు ఇచ్చాడు.