చేపల వేటకు వెళ్తే..ఇది దొరికింది - MicTv.in - Telugu News
mictv telugu

చేపల వేటకు వెళ్తే..ఇది దొరికింది

May 24, 2022

చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని రీతిలో ఓ అరుదైన చేప దొరికిన ఘటన అమెరికన్‌లోని టెక్సాస్లోని సరస్సులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో.. ఇద్దరు మత్స్యకారులు చేపల కోసం గాలం వేయగా వారికి ‘ఎలిగేటర్ గార్’ అనే ఓ అరుదైన చేప చిక్కింది. దాంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అనంతరం ‘ఎలిగేటర్ గార్’ గురించి నిపుణులు మాట్లాడుతూ.. ”చేపలలో 28 వేలకు పైగా జాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ ప్రదేశాల్లో మనకు కనిపిస్తుంటాయి. కానీ, కొన్ని అరుదైన చేపల గురించి మాత్రం చాలామంది తెలియదు. అందులో ఒకటి ‘ఎలిగేటర్ గార్’. ఇది చాలా అరుదైన చేప జాతికి చెందినది. అరుదుగా కనిపిస్తుంది. ఈ ఎలిగేటర్ గార్ చేపలు ప్రశాంతమైన నదుల్లో మాత్రమే ఉంటాయి. అవి మనుషులకు హాని తలపెట్టవు. కానీ, ఎవరైనా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం వాటికి అవే రక్షించుకోవడానికి ఎంతకైనా తెగిస్తాయి”. అని తెలిపారు.