రేపటి నుంచి గోల్కొండ కోట రీఓపెన్ - MicTv.in - Telugu News
mictv telugu

రేపటి నుంచి గోల్కొండ కోట రీఓపెన్

July 5, 2020

nbhvnm

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోన్న సంగతి తెల్సిందే. రోజుకి సగటున 1500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ లాక్ డౌన్ లేని కారణంగా హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో సోమవారం నుంచి సందర్శకులకు అనుమతి కల్పించనున్నారు. 

లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులు గోల్కొండతో పాటు హైదరాబాద్ లోని పలు సందర్శక ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతించలేదు. తాజాగా పురావస్తు శాఖ అధికారులు ఈనెల 6 నుంచి సందర్శకులను అనుమతించాలని నిర్ణయించారు. ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు గోల్కొండ కోటను తెరిచి ఉంచనున్నారు. పర్యాటకులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. గోల్కొండ కోట సందర్శనకు వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా కరోనా వైరస్ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. సందర్శకులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.