కూలిపోయిన గోల్కొండ కోట గోడ   - MicTv.in - Telugu News
mictv telugu

కూలిపోయిన గోల్కొండ కోట గోడ  

October 17, 2020

gbgbfg

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపార నష్టం వాటిళ్లింది. పంట పొలాలు, ఇండ్లు నీట మునిగాయి. కొన్ని చారిత్రక కట్టడాలు కూడా కూలిపోయాయి. ఇటీవలే జనగామ జిల్లాలోని సర్వాయి పాపన్న కట్టించిన చారిత్రక కోట ధ్వంసం అయింది. తాజాగా హైదరాబాద్‌కే తలమానికంగా మారిన గోల్కొండ కోటకు కూడా ఈ ప్రభావం తప్పలేదు. కోటలోని ఓ గొడ ఒక్కసారిగా కూలిపోయింది. పర్యాటకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే అధికారులు తదుపరి చర్యలను ప్రారంభించారు. 

కోటలో ఉన్న శ్రీజగదాంబిక అమ్మవారి ఆలయం ముందున్న 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయింది. చాలా కాలం క్రితం పగుళ్లు రావడంతో ఇది సంభవించింది.  పది నెలల క్రితం ఇదే గోడపై ధ్వంసమైన బురుజులకు అధికారులు మరమ్మతులు చేశారు. అప్పటికే ఈ గోడకు పగుళ్లు ఉండటం గమనించినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వరుసగా కురుస్తున్న వర్షాలతో నాని ధ్వంసం అయింది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని పలువురు విమర్శిస్తున్నారు.