బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. కొంతకాలంగా భారీ పెరుగుతూ ఆకాశన్నంటిన బంగారం ధరలు ప్రస్తుతం నేలవైపు చూస్తున్నాయి. బంగారం కొనుగోలు చేసేందుకు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న పసిడి ప్రియులకు ఇది మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. గత పదిరోజుల్లో బంగారం ధర ఒక్కసారి మాత్రమే పెరిగింది.
అయితే భారత్లో ఈరోజు 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధర తగ్గింది. నేడు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 56,080 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 51,370గా నమోదు అయ్యింది.
దేశంలోని ప్రముఖ నగరాల బంగారం ధరలలో నేడు హెచ్చుతగ్గులున్నాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 ఉండగా… 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ.47,927గా నమోదు అయ్యింది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాములు ధర రూ. 200 పతనంతో రూ. 51,800ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పతనంతో రూ.56,510గా నమోదు అయ్యింది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,510 గా నమోదు అయ్యింది. విశాఖపట్నంలో బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,510 గా ఉంది. మరోవైపు హైదరాబాద్, కేరళ, బెంగళూరు, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ. 71,500నమోదు అయ్యింది.