Gold and silver prices fell on February 8, 2023
mictv telugu

బంగారం కొనాలనుకునేవారికి గుడ్‎న్యూస్, పడిపోయిన ధరలు…!!

February 9, 2023

Gold and silver prices fell on February 8, 2023

మహిళలకు శుభవార్త. బంగారం ధరలు భారీగా పడిపోయాయి. బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. బంగారంతోపాటు వెండి కూడా నేలచూపులు చూస్తోంది. ఇది పసిడి ప్రియులకు ఊరటనిచ్చే వార్త. మల్టీ కమొడిటి ఎక్స్చేంజ్ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయిది. ఫిబ్రవరి 8న బంగారం ధర రూ. 130 పడిపోయింది. దీంతో పసిడి ధర పది గ్రాములకు రూ. 57,130కు తగ్గింది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. వెండికూడా పసిడి బాటలోనే పయనించింది. వెండి ధర స్వల్పంగా తగ్గి…కేజి వెండి రేటు కేవలం రూ. 50 పడిపోయింది. దీంతో కేజి వెండి ధర రూ. 67, 485కు తగ్గింది.

కాగా రానున్న కాలంలో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి ధర ఏకంగా రూ. 65వేలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కొనసాగితే..బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. బంగారంతోపాటు వెండి కూడా అదే బాటలో పయనిస్తుందని కేజి వెండి ధర రూ. 65వేలకు చేరొచ్చనే అంచనా వేస్తున్నారు. కానీ బంగారం ధర ఈ మధ్య రూ. 59వేల మార్క్ కు చేరుకున్న విషయం కూడా తెలిసిందే.

కానీ బంగారం జోరు కొనసాగించలేదు. 59వేల నుంచి తగ్గి ప్రస్తుతం రూ. 57వేలకు చేరుకుంది. కానీ రానున్న రోజుల్లో మాత్రం పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. కాగా వెండి కూడా ఈ ఏడాదిలో రూ. 80వేలకు చేరుకునే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రపంచమార్కెట్లో బంగారం ధరలు ఔన్స్ కు 1887 డాలర్ల వద్ద ఉంది. బంగారం రేటు ఈ మధ్యే 1900 డాలర్ల పైకి చేరిన సంగతి తెలిసిందే. 1900 డాలర్ల నుంచి తగ్గిన తర్వాత క్రమంగా పైకి చేరుకుంటోంది. వెండి రేటు ఔన్స్ కు 22.37 డాలర్ల వద్ద కొనసాగుతుండగా…ఈ మధ్యకాలంలో 20డాలర్లకు తగ్గింది.