బులియన్ మార్కెట్లో బంగారం ధర మంగళవారం భారీగా తగ్గింది. ఒక్కరోజే వెయ్యి రూపాయలకు పైగా తగ్గడంతో వినియోగదారులు ఊరట చెందారు. వెండి కూడా అదే బాటలో పయనించి కేజీకి రూ. 1300 తగ్గింది. హైదరాబాదులో నమోదైన ధరలు విభాగాల వారీగా ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే రూ. 960 తగ్గి రూ. 47,400 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 1050 తగ్గి రూ. 51,710 గా ఉంది. వెండి కిలో రూ. 1300 తగ్గి రూ. 66000గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్టణంలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం మార్కెట్లో అన్నిరకాల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడు ఇక్కట్లకు గురవుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గడం కొంత ఉపశమనంగా భావించవచ్చు.