బంగారం, వెండి ధరలు కళ్లేలు లేని గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. పసిడి ధర ఈ రోజు మళ్లీ పెరిగింది. తొమ్మిది నెలల్లో గరిష్ట ధరను నమోదు చేసింది. అమెరికా బ్యాంకుల నిర్ణయాలు, స్విస్ బ్యాంకుల నుంచి చైనా, టర్కీ, సింగపూర్, థాయిలాండ్ తదితర దేశాలకు పసిడి ఎగుమతులు, కరోనా భయాల నేపథ్యంలో మదుపర్లు పచ్చలోహమే భద్రత కల్పిస్తుందని కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో మన దేశంలోనూ ధరలు పుంజుకున్నాయి. గురువారం
హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 400 పెరిగి రూ. 52,700 నుంచి రూ. పెరిగి రూ. 53,100 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 57,490 నుంచి రూ. 440 పెరిగి రూ. 57,930కి చేరుకుంది. మరోపక్క వెండి ధర కూడా పైకి ఎగబాకింది. కేజీకి రూ. 1000 పెరిగి రూ. 75,000కు చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో జ్యుయెలరీకి డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇదే ఊపులో కొనసాగితే గత ఏడాది ఏప్రిల్ నాటి ట్రెండ్ పునరావృతం అవుతుందంటున్నారు.
దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయిర్ వేడుకలు, సంక్రాంతి నేపథ్యంలో మళ్లీ పరుగు అందుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పసిడి ధరలు రూ. దాదాపు 12 వేలు పెరిగాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ రెండు మూడు నెలల్లోనే నిపుణులు ఊహించినట్లు 24 కేరట్ల బంగారం రూ. 60 వేలకు, 22 కేరట్ల బంగారం రూ. 55 వేలకు చేరుకోవడం ఖాయం.\
ఇవి కూడా చదవండి :
IBMలో లేఆఫ్‌లు..3900మంది ఉద్యోగులకు ఉద్వాసన..!!
Smart Watch : వాయిస్ అసిస్టెంట్, మెటల్ బాడీ ఫీచర్స్, అదరగొడుతున్న ఫైర్‌బోల్ట్ స్మార్ట్‌వాచ్ లుక్..!!