మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

March 5, 2022

04

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర శనివారానికి 700 పెరిగి 48,400 కి చేరింది. 24 క్యారెట్లు పది గ్రాముల ధర 760 పెరిగి 52,800 కి చేరింది. కేజీ వెండి 900 రూపాయలు పెరిగి 73,400 కి చేరింది. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ. 1200 పెరగగా, 22 క్యారెట్ల బంగారం రూ. 1100 పెరిగింది. వెండి కేజీ గత ఐదు రోజుల్లో రూ. 3500 పెరిగింది. మరోవైపు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.