మళ్లీ భగ్గుమన్న బంగారం.. తాజా ధరలు ఇవీ - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ భగ్గుమన్న బంగారం.. తాజా ధరలు ఇవీ

March 22, 2022

gold

గత నాలుగు రోజులుగా పెద్దగా మార్పులు లేని బంగారం, వెండి ధరలు ఇవ్వాళ మళ్లీ పెరిగాయి. చమురు, గ్యాస్ ధరలు పెరగడంతో ఆ ప్రభావం బంగారం, వెండిపై పడింది. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే 10 గ్రాములకు రూ. 350 పెరిగి రూ. 47,750కి చేరింది. 24 క్యారెట్ల బంగారం రూ. 400 పెరిగి 52,100కి చేరింది. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 73,400కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.