gold and silver rate today 29th June 2022, hyderabad
mictv telugu

బంగారం ధర ఢమాల్… వెండి కూడా పతనం..

June 29, 2022

పసిడి ప్రియులకు ఈరోజు కళ్ళు చెదిరే గుడ్ న్యూస్. బంగారం ధర శాంతించింది. నిన్న పెరిగిన పసిడి రేట్లు ఈరోజు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో జూన్ 29న అంటే బుధవారం 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 46,750కు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,000 లకు తగ్గాయి. నిన్న (మంగళవారం) 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 47,650 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,980 వద్ద ఉన్నాయి. మరోవైపు, వెండి ధరలు కూడా పసిడి బాటలోనే పయనించాయి. ఈరోజు వెండి రేటు రూ. 600 దిగివచ్చింది. దీంతో వెండి ధర కేజీకి రూ. 59,400లకు పడిపోయింది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.

అయితే బంగారం ధరలు తగ్గాయని.. వెంటనే నగలను కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే ఆ తర్వాతి రోజుల్లో మరింతగా తగ్గవచ్చు. అందుకే వరుసగా కొన్ని రోజుల పాటు బంగారం ధరలను గమనించాలి. వరుసగా తగ్గి.. ఆ తర్వాత ఇక పెరవచ్చనే సంకేతాలు వస్తే.. అప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.