దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 రూపాయలు తగ్గింది. దీంతో బంగారం ధర రూ.51వేలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం రూ.720 తగ్గి రూ.55,630 దగ్గర స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ధర పడిపోయిందని నిపుణులు పేర్కొంటున్నారు. వెండి ధర కూడా భారీగానే పడిపోయింది. వెండి ధర సైతం కిలోకు రూ. 2500 తగ్గి రూ.67,500 పలుకుతోంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడంతో స్పాట్ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1814 డాలర్లు ఉండగా, వెండి 20 డాలర్ల వరకు ట్రేడవుతోంది. ధరలు తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు పండుగ చేసుకుంటున్నారు.