బంగారం మళ్లీ జంప్.. వెండి పతనం - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం మళ్లీ జంప్.. వెండి పతనం

September 21, 2020

Gold and silver rates today surges

కరోనా వైరస్ వ్యాప్తి మొదలయినప్పటి నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గినప్పటికీ.. దేశీ మార్కెట్‌లో మాత్రం పెరుగుతూనే ఉంది. వెండి ధర మాత్రం తగ్గడం గమనార్హం. ఈరోజు హైదరాబాద్‌‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగి రూ.54,060కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 పెరిగి రూ.49,580కు చేరింది. కేజీ వెండి ధర రూ.600 తగ్గి రూ.67,900కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తాగగడంతో వెండి ధర తగ్గినట్టు తెలుస్తోంది. 

ఇక అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గి 1959 డాలర్లు పలుకుతోంది. వెండి ధర ఔన్స్‌కు 0.36 శాతం తగ్గి 27.03 డాలర్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి.