అవును బంగారు ఏటీఎం. 24 క్యారెట్స్ గోల్డ్ తో తయారు చేశారు. కస్టమర్ల కోసం రెడ్ కార్పెట్ పరిచారు. తీస్తే ఇందులోనే డబ్బులు డ్రా చేయాలనేలా ఉంది. ఇది ఎక్కడో తెలుసా..
ప్రపంచంలోనే తొలి ఏటిఎం మరో రికార్డ్ క్రియేట్ చేసింది. 50వ వార్షికోత్సవం సందర్భంగా వరల్డ్ లోనే తొలి గోల్డ్ ఏటీఎంగా మారింది. దీంతోపాటు స్మారక ఫలకాన్ని జోడించి, వినియోగదారులకోసం రెడ్ కార్పెట్ పరిచింది. 1967, జూన్ 27న షెపెర్డ్-బారన్ మొదటి ఎటిఎమ్ రూపొందించారు. ఆ తర్వాత ఉత్తర లండన్లోని బార్క్లే బ్యాంక్ తన మొదటి ఏటీఏం కేంద్రాన్ని ప్రారంభించింది. బ్యాంకు ఆరంభించిన ఆరింటిలో ఇది మొదటిది. ఇక బ్రిటీష్ టీవీ కామెడీ షో “ఆన్ ది బసెస్” లో నటించిన హాలీవుడ్ రెగ్ వార్నీ నగదును ఉపసంహరించుకున్నతొలి వ్యక్తి. 2016 నాటికి బార్క్లే బ్యాంక్ కు చెందిన ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 లక్షల నగదు యంత్రాలు ఉండగా, ఒక్క బ్రిటన్లోనే 70వేల ఏటీఏం సెంటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. దాదాపు175 బిలియన్ పౌండ్లను పంపిణీ చేసింది.