అలియా, రణ్‌బీర్‌కు బంగారు బోకే - MicTv.in - Telugu News
mictv telugu

అలియా, రణ్‌బీర్‌కు బంగారు బోకే

April 13, 2022

aia

బాలీవుడ్‌లో లవ్ బర్డ్స్‌గా పేరుపొందిన అలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. వీరి వివాహనికి సంబంధించిన మొదటి ఘట్టం బుధవారం(ఈరోజే) నుంచే మొదలైంది. ఈ జంట ఏప్రిల్ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలు తెలిపాయి.

 

అలియాభట్, రణ్‌బీర్ కపూర్‌ల మెహందీ ఫంక్షన్ ఏప్రిల్ 13న (ఈరోజు) జరిగింది. రణ్‌బీర్ కపూర్ బాంద్రా నివాసం వాస్తులో ముందుగా వినాయకుడి పూజ చేశారు. రెండు గంటలకు మెహందీ ఫంక్షన్ మొదలైంది. ఈ ఫంక్షన్‌కు రణ్‌బీర్ కుటుంబ సభ్యులు కరిష్మా కపూర్, నీతూ కపూర్, రిద్దిమా కపూర్, కరీనా కపూర్, అదర్ జైన్, అర్మాన్ జైన్ తదితరులు హాజరయ్యారు. పెళ్లికి ముందు రణ్‌బీర్, అలియాలకు బంగారు కానుక అందింది.

సూరత్‌కు చెందిన బంగారు నగల వ్యాపారి ఈ జంటకు ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను పంపించారు. బంగారు పూతతో కూడిన బోకేను బాహుమతిగా అందించారు. రణ్‌బీర్ కపూర్ ఫ్యాన్ క్లబ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వీడియోను వీక్షించిన అభిమానులందరూ తెగ షేర్ చేస్తున్నారు.

మరోపక్క గతకొన్ని రోజులుగా భద్రతా కారణాల వల్ల అలియా భట్ ఏప్రిల్ 14న కాకుండా ఏప్రిల్ 20న పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలను అలియా భట్ సోదరుడు రాహుల్ భట్ ఖండించాడు. అవి పుకార్లని స్పష్టం చేశాడు. పెళ్లి తేదీలో ఎటువంటి మార్పు లేదని చెప్పాడు. ఏప్రిల్ 14నే వివాహం జరగుతుందని వివరించాడు.