ఆఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడి ఇంట్లో బంగారు ఇటుకలు - MicTv.in - Telugu News
mictv telugu

ఆఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడి ఇంట్లో బంగారు ఇటుకలు

September 14, 2021

Gold bricks found in former Afghanistan vice president saleh

ఒకటి కాదు రెండు కాదు మొత్తం 18 బంగారు ఇటుకలు లభ్యమయ్యాయి. ఇవన్నీ ఎక్కడో గుప్తనిధిలోనో, స్మగ్లర్ల వద్దో బయటపడ్డాయనుకుంటే మీరు పొరబడినట్లే. ఇవన్నీ లభించింది ఆఫ్ఘన్ మాజీ ఉపాధ్యాక్షుడు అమ్రుల్లా సలేహ్ నివాసంలో. వీటి విలువ మనదేశపు కరెన్సీలో దాదాపు రూ.47.5 కోట్లకు పైగానే. ఈ విషయాన్ని తాలిబాన్లు ట్విట్టర్ ‌ద్వారా వెల్లడించారు.

ఆయుధబలంతో ఆఫ్ఘాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు పంజ్‌షీర్ నేషనల్ రెజిస్టెన్స్ ఫ్రంట్‌తో (ఎన్‌ఆర్‌ఎఫ్) పోరులో భాగంగా మాజీ అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సోదరుడు రోహుల్లా అజీజీని హత్యచేసి అతని ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో బంగారు ఇటుకలు లభించాయి. అయితే ఎన్‌ఆర్‌ఎఫ్ నాయకుడు అహ్మద్ మసూద్, సలేహ్ జాడ మాత్రం తాలిబాన్‌లకు ఇప్పటివరకు లభ్యంకాలేదు.

తాలిబ‌న్‌ ముష్కరులు గత 20 సంవత్సరాలుగా అమెరికా మద్దతుతో కొనసాగుతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. కాబూల్‌లోని అధ్యక్షభవనాన్ని ఆగష్టు15న స్వాధీనం చేసుకోవ‌డంతో ఆప్ఘనిస్థాన్‌లో అష్ర‌ఫ్ ఘ‌నీ ప్ర‌భుత్వ ప‌త‌నం సంపూర్ణం అయ్యింది. దీంతో మానవ హక్కులు హరించుకపోయాయి. సెప్టెంబ‌ర్ 7న తాలిబ‌న్‌లు కొత్త క్యాబినెట్‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. తాలిబ‌న్ నేత ముల్లా మ‌హ‌మ్మ‌ద్ హ‌స‌న్ నేతృత్వంలోని తాత్కాలిక ప్ర‌భుత్వాన్ని కొలువుదీర్చారు. మ‌రో నాయ‌కుడు అబ్దుల్ ఘ‌నీ బ‌రాద‌ర్‌ను ముల్లా మ‌హ‌మ్మ‌ద్‌కు డిప్యూటీగా ఎన్నుకున్నారు.