Gold Coins found in oil palm farm at Koyyalagudem village in Eluru
mictv telugu

పొలంలో బంగారు నాణెలు.. అవాక్కైన రైతు

December 3, 2022

ఓ రైతు పొలంలో బంగారం బయటపడింది. పొలంలో పైప్ లైన్ కోసం తవ్వుతుంటే బంగారు నాణెలు ప్రత్యక్షమయ్యాయి. ఏపీలోని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడువాడలపాలెం గ్రామానికి చెందిన రైతు మానుకొండ తేజస్వి తన ఆయిల్ ఫాం తోటలో పైపులైన్ పనులు ప్రారంభించాడు. దీని కోసం తవ్వకాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మట్టిపిడత కనిపించింది. మట్టి పిడతను పగులగొట్టి చూడగా అందులో పురాతన కాలానికి చెందిన 18 బంగారు నాణేలు ఉన్నాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు నాణెలను పరిశీలించారు. ఒక్కో నాణెం సుమారు 8 గ్రాములకు పైగా బరువు ఉన్నట్లు గుర్తించారు. ఇవి రెండు శతాబ్దాల క్రితం నాటివిగా భావిస్తున్నారు. గత నెల 29న ఈ బంగారు నాణేలు దొరకగా.. విషయం ఆలస్యంగా బయటపడింది.