నల్లకుంట శంకరమఠంలో బంగారు మాయం - MicTv.in - Telugu News
mictv telugu

నల్లకుంట శంకరమఠంలో బంగారు మాయం

May 18, 2019

హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో భారీ చోరీ జరిగింది. రూ. 18 లక్షల విలువైన బంగారం నగలు, పాత్రలు కనిపించకుండా పోయాయి. చోరీ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన నిర్వాహకులు నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు భక్తులు సమర్పించి కానుకలను భద్రపరిచే గదిలోకి చొరబడి నగలు ఎత్తకెళ్లినట్లు వెల్లడించారు.  మఠంలో పనిచేస్తున్నఓ వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, సాయి అనే ఇద్దరు క్లర్కులను ఇప్పటికే ఉద్యోగాల నుంచి తీసేశామని చెప్పారు. గతంలోనూ మఠంలో చోరీలు జరిగాయని, అయితే విషయం బయటికి రాలేదని భక్తుల చెబుతున్నారు.

Gold jeweGold jewelry stolen from Hyderabad nallakunta sankaramatam two employees removed lry stolen from Hyderabad nallakunta sankaramatam two employees removed