రూ. 5 లక్షల విలువైన బంగారు పతంగి..ఏం చేశాడంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

రూ. 5 లక్షల విలువైన బంగారు పతంగి..ఏం చేశాడంటే.. 

January 16, 2020

Gold Kite.

సంక్రాంతి వచ్చిందంటే చాలు అంతా సంబరాల్లో మునిగిపోతారు. ముఖ్యంగా చిన్నా పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తూ సంతోషంగా గడుపుతారు. సంక్రాంతి మూడు రోజులు రంగు రంగుల గాలిపటాలతో ఆకాసం సప్త వర్ణాలను సంతరించుకుంటుంది. దీని కోసం ఎంతైనా ఖర్చు చేసి పెద్ద పెద్ద కైట్స్ కొని ఎగురవేస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దీనికి భిన్నంగా చేశాడు. పతంగులపై ఉన్న మమకారాన్ని మెడలో ధరించి మరో రకంగా చూపించాడు. 

భోపాల్‌కు చెందిన లక్ష్మీనారాయణ ఖండేవాల్(66) బంగారంతో చేసిన పతంగిని తన మెడలో ధరించి సంబరపడిపోతున్నాడు. దీనిపై ఉన్న మమకారంతో రూ. 5 లక్షల విలువ చేసే కైట్ రూపంలోని లాకెట్ తయారు చేయించుకొని మెడలో వేసుకున్నారు.అంతా గాలిపటాలు గాల్లో ఎగురవేస్తే అతడు మాత్రం మెడలో ధరించడం ఆసక్తిగా మారింది. ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా ప్రతీ ఏటా లక్ష్మీనారాయణ ఖండేవాల్ గాలిపటాల పోటీలలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. ఇతడి కామెంట్రీ అక్కడికి వచ్చిన వారందరిని ఎంతో ఆకట్టుకుటుంది.