ముట్టక ముందే పేలిన బంగారం బాంబు.... - MicTv.in - Telugu News
mictv telugu

ముట్టక ముందే పేలిన బంగారం బాంబు….

September 5, 2017

ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబు పేల్చక ముందే దాని ఎఫెక్ట్  టూ మచ్ గా ఉంది. అక్కడ  బాంబు పేలుస్తానని  ఆ దేశ అధ్యక్షుడు కిమ్…..చెప్పాడో లేదో….. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఢమాల్ మని పేలాయి. మన దగ్గర అయితే ఈ యేడాదిలోనే తులం గోల్డ్ హైఎస్ట్ ప్రైస్ పలికింది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పరిణామాలతో బంగారం కొనాలన్నా జనాలు దడుసుకుంటున్నారు.

అలాంటి సమయంలో కిమ్ హైడ్రోజన్ బాంబు ముచ్చట  తీశారు. ఈ మాట ప్రభావం అంతర్జాతీయ రాజకీయాలపై పడి… ఏకంగా బంగారం ధర వైపు టర్న్ తీసుకున్నాయట. దాంతో పాటు లోకల్ మార్కెట్లు… ఇక్కడి పరిణమాల ప్రభావాలు కూడా తోడయ్యాయట. అందుకే తులం బంగారం ధర 30600 పెరిగిందట. ఒక్క నాడే 200 రూపాయలు తులంపై అదనంగా పెరిగిందట. ఎక్కడి నార్త్ కోరియా… ఎక్కడి ఇండియా… అక్కడ ఆయనో మాట చెప్తే ఇక్కడ ధరలు  పెరగడం ఏమిటో… అంతా  పత్తాలట లెక్కనే ఉంది స్టోరీ.  దీని గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం కంటే… కాస్త తగ్గినప్పుడు ఇంత కొని పెట్టుకుంటే సరిపోతుందని సూచించే వారూ   లేక పోలేదు.