4.5 కోట్ల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా కొలువుదీరిన అమ్మవారు... - MicTv.in - Telugu News
mictv telugu

4.5 కోట్ల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా కొలువుదీరిన అమ్మవారు…

October 15, 2018

శరన్నవరాత్రి సందర్బంగా విశాఖపట్నంలోని కురుపాం మార్కెట్ ప్రాంతంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారిని ఘనంగా అలంకరించారు. ఈ ఆలయానికి దాదాపుగా 100ఏళ్ల చరిత్ర ఉంది.  శరన్నవరాత్రిలో భాగంగా అమ్మవారిని 9 రోజులు 9 అవతారల్లో భక్తులకు దర్శనమిస్తోంది. ఆదివారం నాడు అమ్మవారు ధనలక్ష్మిగా కొలువుదీరింది. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు పట్టుచీర, సుమారు రూ.4.5 కోట్ల నగదుతో అలంకరించారు.Gold ornaments, sari and gold biscuits. These caregivers were provided by 200 devotees in the city.అలాగు 4 కిలోల బంగారు ఆభరణాలు అమ్మవారికి అలంకరించారు. అమ్మవారికి అలంకరించిన నగదులో రూపాయి నుంచి రూ.2 వేల వరకు నోట్లు, నాణేలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు, చీరతోపాటు బంగారు బిస్కెట్ల నడుమ అమ్మవారిని కొలువుతీర్చారు. నగరంలో ఉన్న 200 మంది భక్తులు ఈ అభరణాలను సమకూర్చారు.