కాళహస్తి అంటే అందరికీ అక్కడి వైభవోపేతమైన శివాలయమే గుర్తొస్తొంది. ఏనుగు, సాలీడు, పాము, భక్త కన్నప్ప అక్కడి శివుణ్ని కొలిచి తరించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే కాళహస్తిలో శైవంతోపాటు వైష్ణవం కూడా బాగానే వర్ధిల్లింది. అక్కడి వరదరాజస్వామి ఆలయం దీనికి ఉదాహరణ. ప్రస్తుతం కాళహస్తి దేవస్థానమే నిర్వహిస్తున్న ఈ అనుబంధ ఆలయంలో ఓ అద్భుతం వెలుగు చూసింది. వరదరాజ స్వామి మూలవిరాట్ పానమట్టంలో బంగారు రేకులు వెలుగు చూశాయి.
అష్టమూలిక పంచాయతనగా వ్యహరించే సంప్రదాయం ప్రకారం 37 బంగారు రేకులు అందులో నిక్షప్తం చేశారు. కొన్ని శతాబ్దాల కిందట వీటిని అమర్చారని, చారిత్రక ప్రాధాన్యం ఉందని అధికారులు చెప్పారు. వరదరాజస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విగ్రహాన్నిశుక్రవారం పక్కకు తీసి పరీశీలిస్తుండగా రేకులు కనిపించాయి. వీటితోపాటు రెండు లక్ష్మీకాసులు, నవరత్నాలు లభించాయి. పోలీసు సిబ్బంది, ఆలయ అధికారుల సమక్షంలో వీటినీ పరిశీలించి భద్రపరిచారు. విష్ణువు విగ్రహాలను ప్రతిష్టించే సమయలో అష్టామూలకా పంచాయతనాలు, నవధాన్యాలు, నవరత్నాలు ఉంచడం సంప్రదాదాయం.