Gold price break
mictv telugu

బంగారం ధరకు బ్రేక్..ఎంత తగ్గిదంటే..

June 22, 2022

Gold price break

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పసిడి ధరలు పరుగులు తీసిన విషయం తెలిసిందే. బంగారంకు ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. దీంతో ప్రజల అవస్థలను గుర్తించిన అధికారులు ధరలకు కాస్తంతా బ్రేకులు వేశారు. ఈ క్రమంలో బంగారం కొనాలని ఆశగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్తను చెప్పారు. నిన్నటి వరకూ దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650గా ఉంది. నేడు ఆ ధర రూ. 200 తగ్గి 47,450కి చేరింది. ఇక, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,980 నుంచి 220 తగ్గి 51,760కి చేరింది.

ఇక, హైదరాబాద్‌ విషయానికొస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి, 47,450కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి, రూ. 51,980లుగా ఉంది. కిలో వెండి ధర రూ.66,300 నుంచి 300 తగ్గి 66,000 వేలకు చేరింది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం రేటు కాస్తంతా తగ్గింది. దీంతో 1831 డాలర్ల వద్ద కదలాడుతోంది. అలాగే సిల్వర్ రేటు 1.06 శాతం పడిపోవడంతో.. ఔనకు 21.53 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.