భారీగా పడిపోయిన బంగారం ధర.. ఒక్కరోజే - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా పడిపోయిన బంగారం ధర.. ఒక్కరోజే

February 29, 2020

Gold price

కొన్నాళ్లుగా పట్టపగ్గాల్లేకుండా ఎగబాకుతున్న పసిడి ధరకు కళ్లెం పడింది. ఈ రోజు బంగారం ధర భారీగా దిగొచ్చింది. హైదరాబాద్‌లో 24 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 750 పడిపోయి రూ. 43660కు చేరింది. ఆభరణాలకు వాడే 22 కేరట్ల స్వర్ణం ధర రూ. 850 తగ్గి రూ. 39,860కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, రూపాయి మారకం విలువ కాస్త బలపడడం దీనికి కారణం. స్టాక్ మార్కెట్ ఒడిదొడకులతో పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లలో వచ్చిన నష్టాల నుంచి గట్టెక్కడానికి గోల్డ్ నిల్వలను అమ్మేశారు. బంగారం ధర తో పాటు వెండి ధరలు కూడా కూడా తగ్గాయి. శనివారం వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 30 రూపాయలు తగ్గి రనూ. 49,570కి చేరింది.