బంగారం ప్రియులకు శుభవార్త.. ఈ రోజు పతనం ఎంతంటే?
కోవిడ్ కల్లోల కాలంలో చుక్కలు చూపించిన పసిడి ధర ఏడాదిగా తగ్గు ముఖం పడుతూ వస్తోంది. వెండి ధరలు కూడా దిగి వస్తున్నాయి. రెండు రోజుల కింద నెలరోజుల గడువులో అత్యంత కనిష్ట స్థాయికి చేరిన పసిడి ధరలు ఈ రోజు కూడా కాస్త భారీగానే తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 46000లకు చేరుకుంది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 440 తగ్గి రూ. 50,150కి పడిపోయింది. వెండి ధర మాత్రం తేడా లేకుండా కేజీ రూ. 61 వేల వద్ద స్థిరంగా ఉంది.
మరోపక్క అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బులియర్ ధరలు పడిపోతున్నాయి. డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ల గరిష్టంగా ఉండడం దీనికి కారణమంటున్నారు. ఈ నెల 26న జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశ:లో ఫెడ్ రేటు 100 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశముంది. ఆ ప్రకారం జరిగితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశముంది. కొనుగోలుదారులు హడావుడి పడకుండా మార్కెట్ పరిస్థితులను గమనించి కొనుగోలు చేయాలి.