మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ తగ్గిన బంగారం ధర.. ఎంతంటే?

March 23, 2022

gold

ఉక్రెయిన్-రష్యా దేశాల యుద్ధం కారణంగా కొన్ని రోజులపాటు భారీగా పెరిగిన పసిడి ధరలు మళ్లీ తగ్గడం మొదలెట్టాయి. ఈ సందర్భంగా బంగారం కొనాలని ఎదురుచూస్తున్న ప్రియులకు వ్యాపారస్థులు అదిరిపోయే శుభవార్తను చెప్పారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.400కి పైగా తగ్గి రూ.51,315కి చేరుకుంది.

ఇక, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,409 నుంచి రూ.47,005కి పడిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ.47,350కి చేరుకుంది. ఇంకా, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 నుంచి రూ.51,670కి చేరుకుంది.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు 1 కేజీ వెండి ధర రూ.68,521 నుంచి రూ.67,004కి పడిపోయింది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి.