భారీగా పెరిగిన బంగారం.. ఒక్కరోజే 1000 పైకి - MicTv.in - Telugu News
mictv telugu

భారీగా పెరిగిన బంగారం.. ఒక్కరోజే 1000 పైకి

March 25, 2020

Gold price hiked 

కరోనా పాపమా అని నిత్యావసరాలు ధరలు కొండెక్కాయి. తాను మాత్రం ఏం తక్కువ అన్నట్లు బంగారం ధర కూడా భారీగా పెరిగిపోయింది. గతవారం భారీగా పడిపోతూ, ఈ వారం రోజులుగా క్రమ తప్పకుండా పెరుగుతున్న కనకం ఒక్కసారిగా షాకిచ్చింది. ఈ రోజు ఒక్కరోజే వెయ్యి రూపాయలకుపైగా పైకెగసింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో పసిడిపై పెట్టుబడులు సురక్షితంగా భావించిన ఇన్వెస్టర్లు మళ్లీ దానిపై కన్నేయడమే దీనికి కారణం. అమెరికా, యూరప్ బ్యాంకులు కూడా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో బంగారినికి మళ్లీ మెరుపొచ్చింది. 

హైదరాబాద్ నగరంలో 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 1010 పెరిగి రూ. 44,630కి చేరుకుంది. ఇక 22 కేరట్ల ఆభరణా బంగారం కూడా రూ. 1007  పెరిగి రూ. 41800 పలికింది. వెండి ధర కూడా పెరుగుదల నమోదు చేసింది. కేజీకి రూ. 790 పెరిగి రూ. 41,810 పలికింది.