వామ్మో, వాయ్యో! ఏకంగా రూ. 930 పెరిగిన బంగారం - MicTv.in - Telugu News
mictv telugu

వామ్మో, వాయ్యో! ఏకంగా రూ. 930 పెరిగిన బంగారం

July 11, 2019

Gold price hiked by 930 in one day 

బంగారం ధర చుక్కలతోపాటు గ్రహాలను, గ్రహశకలాలనూ చూసింది. బడ్జెట్ పుణ్యమా అని మహిళలపై ఆశలను చిదిమేసి పసిడి కనీవినీ ఎరగనంతగా జంప్ జిలానీ అనేంది. ఈ రోజు 10 గ్రాముల ధర ఏకంగా రూ. 930 పెరిగి హిమాలయాలు ఎక్కి కూర్చుంది. అంతర్జాతీయంగా మార్కెట్లు ఆశావహంగా కనిపించడం, దేశీయంగా డిమాండ్ పెరగడంతో బంగారం నిజంగా బంగారమే అయ్యింది. 

దేశీ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 35,800కు చేరింది. వెండి కూడా రూ. 300 ఎగబాకి కేజీ రూ. 39,200 పలికింది. నాణేల కంపెనీలు, పారిశ్రమల నుంచి తెల్లబంగారానికి డిమాండ్ పెరిగింది. అస్థిర వ్యాపారల్లోకంటే బంగారంలోనే పెట్టుబళ్లు మేలని చాలామంది దాన్న కొనేస్తున్నారని, ఫలితంగా అది షాకిస్తోందని నిపుణులు చెబుతున్నారు.  అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,420.80 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.24 డాలర్లుగా నమోదైంది. బడ్జెట్‌లో బంగారం, ఇతర ఖరీదైన లోహాలపై సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంతో పచ్చలోహం భగ్గుమంటోంది.