బంగారం ధర మటాష్.. ఈరోజు రూ.3000 తగ్గుదల  - MicTv.in - Telugu News
mictv telugu

బంగారం ధర మటాష్.. ఈరోజు రూ.3000 తగ్గుదల 

August 12, 2020

Gold price hyderabad market .

పెరుగుట విరుగుట కొరకే సామెత నిజమైంది. కరోనా సంక్షోభంలో కొనే దిక్కులేకపోయినా.. తగ్గేది లేదన్నట్టు మొన్నటి వరకు పెరిగి విరిగిన బంగారం ధర ఈ రోజు భారీగా పరడిపోయిది. కరోనా వైరస్‌ను కట్టడి చేసే టీకాను రష్యా విడుదల చేయడంతో పసిడి వెలవెలబోయింది. ఏకంగా రూ. 3000లకు పైగా తగ్గింది. 

హైదరాబాద్‌లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 3,010 పడిపోయి రూ. 50.130కి చేరుకుంది. 24 కేరట్ల స్వచ్చమైన బంగారం ధర కూడా రూ. 3,350 తగ్గి రూ. 54,680కి చేరింది. నెలరోజుల్లోనే 50 శాతంపైగా పెరుగుదల నమోదు చేసిన వెండి ధరలు కూడా పతనం అవుతున్నాయి. కేజీ వెండి ధర నిన్న రూ. 2600 తగ్గి రూ. 72500కు చేరింది. కాగా, ఫ్యూచర్స్ మార్కెట్లో ఈ రెండు రెండు సెషన్ల తర్వాత పసిడి ధర రూ. 51,579, వెండి ధర రూ. 65633 పలికింది. పాశ్చాత్య దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టడం, డాలరు విలువ బలపడ్డంతో బంగారం ధరలు తగ్గుతున్నాయి.