పసిడి ధరలకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మళ్ళీ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.324 పెరిగి రూ.51,704కు పలుకుతోంది. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,380 వద్ద ముగిసింది. హైదరాబాద్ విషయానికి వస్తే.. పది గ్రాముల 24 కేరట్ల బంగారం ధర రూ. 190 పెరిగి రూ. 52,940కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 కేరట్ల బంగారం ధర రూ. 180 పెరిగి రూ. 48,530కు పలుకుతోంది.
వెండి విషయానికి వస్తే.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1598 పెరిగి రూ.62,972కు చేరింది. నిన్న ట్రేడ్లో కిలో వెండి ధర రూ.61,374 వద్ద ముగిసింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 600 పెరిగి రూ. 61,600కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1910 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.35 అమెరికన్ డాలర్లు పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకోవడమే దేశీయంగా పసిడి ధర పెరుగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు.