gold price raised Rs. 1310 in one day in india
mictv telugu

పన్ను ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ. 1310 పెరిగిన బంగారం, వెండి ఎంతుందంటే

July 1, 2022

శుక్రవారం బంగారం ధర షాకిచ్చింది. ఒక్కరోజే రూ. 1310 పెరిగింది. ఢిల్లీలో ధర పది గ్రాములకు రూ. 52,200కి చేరింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గడం విశేషం. వెండి కేజీ ధర ప్రస్తుతం రూ. 59000 వేలు ఉంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పెంచడం తెలిసిందే. దీంతో ధర పెరిగినట్టు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కాస్త తగ్గాయి. ఔన్సు ధర ప్రస్తుతం 1794 డాలర్లుగా ఉంది. వెండి ధర 1976 డాలర్లుగా ఉంది. హైదరాబాదులో కూడా ఇవే ధరలు ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1200 పెరిగి రూ. 47,850 వద్ద చేరింది. కాగా, రానున్న రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశముందని బులియన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.