రూ.74,000 పెరుగనున్న బంగారం ధర! - MicTv.in - Telugu News
mictv telugu

రూ.74,000 పెరుగనున్న బంగారం ధర!

April 23, 2020

Gold price rise in future

కరోనా ప్రభావంతో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. అనేక దేశాల ఆర్థిక మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా బంగారం ధర భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.45 వేలు ఉంది. భవిష్యత్తులో బంగారం ధర భారీగా పెరగొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వచ్చే 18 నెలల కాలంలో బంగారం ధర ఔన్స్‌కు 3,000 డాలర్లకు పెరగొచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. 

మన కరెన్సీలో 10 గ్రాములకు దాదాపు రూ.74,000. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు సడలింపు విధానాలను అనుసరించడం సహా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేయవచ్చనే అంచనాలు పసిడి డిమాండ్‌కు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు వివరించారు. అమెరికా డాలర్ బలోపేతం కావడం, వర్ధమాన దేశాల్లో పసిడి డిమాండ్ పడిపోవచ్చనే అంచనాలు పసిడి ధరపై ప్రభావం చూపొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.