బంగారం ధరలు భగ్గున మండుతున్నాయి. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి జోష్లో కొండెక్కిన పసిడి దిగిరానంటోంది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ కూడా తోడు కావడంతో బంగారం భారీ పెరుగుదల నమోదు చుస్తోంది. వారంలో ఒక రోజు ధర తగ్గితే మిగతా రోజుల్లో పైపైకే వెళ్లిపోతోంది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.350 పెరిగి రూ. 52,350 నుంచి రూ. పెరిగి రూ. 52,700 వద్ద స్థిరపడింది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 57.110 నుంచి రూ. 380 పెరిగి రూ. 57,490కి చేరుకుంది. మరోపక్క వెండి ధర కాస్త పైకి ఎగబాకింది. కేజీకి రూ. 700 పెరిగి రూ. 74,000కు చేరుకుంది.
దసరా, దీపావళి పండగల్లో బంగారం, వెండి ధరలు కాస్తా పెరిగి మళ్లీ తగ్గాయి. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయిర్ వేడుకలు, సంక్రాంతి నేపథ్యంలో మళ్లీ పరుగు అందుకున్నాయి. స్టాక్ మార్కెట్ పరిమాణాలతో సంబంధం లేకుండా రోజురోజూకు పైకి వెళ్లిపోతున్నాయి. కోవిడ్ కేసుల వ్యాప్తి, ప్రపంచం మళ్లీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ఫలితంగా బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి.
గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే పసిడి ధరలు రూ. దాదాపు 12 వేలు పెరిగాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ రెండు మూడు నెలల్లోనే నిపుణులు ఊహించినట్లు 24 కేరట్ల బంగారం రూ. 60 వేలకు, 22 కేరట్ల బంగారం రూ. 55 వేలకు చేరుకోవడం ఖాయం.
ఇవి కూడా చదవండి :
5G ఫోన్ కేవలం రూ.999లకే, ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ తో కొనే చాన్స్..!!