ఈ డిసెంబర్ నెల నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు నెలల మూఢాల తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. దీంతో వధూవరుల కుటుంబాలు.. బంగారు పెళ్లి నగలు కొనేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో పెరిగిన ధరలు వారికి షాక్ ఇచ్చాయి గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 880 పెరిగి, రూ. 53, 850 గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 పెరిగి, రూ. 48, 550 నమోదైంది. ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 67, 500 గా ఉంది.
ఇక ఏపీలోని విజయవాడలో, వైజాగ్‌లో, ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.54,630 వద్ద కొనసాగుతోంది. పది గ్రాముల పసిడి ధర రూ.54,630 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.65,930గా కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,777.10 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.31 డాలర్ల వద్ద ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 358.70 పాయింట్లు లాభపడి 63,450.59 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 94.35 పాయింట్లు లాభపడి 18,854.45 దగ్గర ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 81.02గా ఉంది.