బంగారం ధర చాలా రోజుల తర్వాత చుక్కలను తాకింది. పెద్ద నోట్లు రద్దు తర్వాత కాస్త ఆగినట్లు అన్పించింది. పెద్దగా తగ్గక పోయినా… పెరగనైతే పెరగ లేదు. ఇక జీఎస్టీ తర్వాత బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. దీని ప్రభావం పెద్దగా లేదనే వాదనలూ వచ్చాయి. తాజాగా బంగారం ధరలు మళ్లోసారి పెరిగా ఇప్పుడు ఏకంగా తులం బంగారం ధర 30 వేల రూపాయల వరకు పెరిగింది.
చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద స్థాయికి చేరుకున్నది బంగారం. ఇన్ని రకాల పరిణామాల మధ్య చాలా వస్తువుల ధరలు తగ్గాయి. కొన్నింటి ధరల్లో మార్పు లేదు. కానీ బంగారం ధరలు మాత్రం పెరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం పెండ్లిల్ల సీజన్ ప్రారంభం అయింది. ఇంకో నాలుగు రోజుల్లో పెండ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతున్నది. బంగారం దుకణాలు కళకళాడుతున్నాయి. ఇలాంటి సీజన్లల్ల ఒక్క రోజులోనే వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దానికి తోడు ప్రతియేటా రకరకాల ఆఫర్ల పేరుతో బంగారంపై రాయితీలిస్తూ జనాలను దుకణాలు ఆకర్షిస్తున్నాయి.
పదేండ్ల కాలంలో బంగారం ధరలు పెరగడం తప్ప తగ్గింది లేదు. తగ్గినా పది రూపాయలు తగ్గినట్లు తగ్గే మల్లా వందల రూపాయలు పెరిగి చుక్కలను తాకింది. తాజాగా తులం బంగారం ధర 30వేల రూపాయలకు పెరిగింది. బంగారం లాంటి జనాలు బంగారంపై మోజు పెంచుకుంటున్నది కొద్ది దీని ధరలు మరింత పెరుగుతూనే ఉంటాయి.